నరమాంసం కోసం చిన్న పిల్లాడిని చంపేసిన బాలుడు…!

Saturday, January 21st, 2017, 01:03:20 PM IST

syko
రోజురోజుకూ మనుషులకు, మృగాలకు మధ్య ఉన్న తేడా తగ్గిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులకంటే మృగాలే నయం అనుకునేలా మనుషుల ప్రవర్తన దిగజారిపోతోంది. ఒక బాలుడికి నరమాంసం తినాలని అనిపించి అన్యంపుణ్యం తెలియని ఒక బాలుడిని చంపి అతని రక్తం తాగి కొంత మాంసాన్ని తిని మిగిలిన మృతదేహాన్ని వేరే చోట పడేసాడు. ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కు వెళ్ళాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లోని డుగ్రీలో చోటుచేసుకుంది.

ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక టీనేజర్ (16) సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో గాలిపటం ఎగరేయడానికి దారం ఇస్తానని చెప్పి దీపకుమార్ అనే బాలుడిని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో అతని తల్లితండ్రులు లేరు. దాంతో బాలుణ్ణి బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో హత్య చేసి ముక్కలు చేసినట్లు చెప్పాడు. ఆ తరువాత అవయవాలను ఒక కవర్లో పెట్టి ఖాళీ ప్రదేశంలో పడేసి, గుండెను మాత్రం తాను చదువుతున్న స్కూల్ లో పడేశానని చెప్పాడు. ఉపాధ్యాయులంటే తనకు ఇష్టం ఉండదని, అందుకే స్కూల్ కి చెడ్డ పేరు తేవడానికి గుండెను అక్కడ పడేశానని చెప్పాడు. పచ్చి మాంసం తినడం తనకు ఇష్టమని, ఒక్కొక్కసారి తన చేతులను కొరుక్కుని తినాలనిపిస్తుందని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడి మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికి నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.