హిట్టా లేక ఫట్టా : తేజ్ ఐ లవ్ యు – అదే పాత స్టోరీ

Friday, July 6th, 2018, 08:47:30 PM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం తేజ్ ఐ లవ్ యు. తొలిప్రేమ చిత్ర దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే వరుస ప్లాప్స్ లో సాయి ధరమ్ తేజ్ మరియు కరుణాకరన్ ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవడం ప్రస్తుతం అవసరం. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోను బట్టి అందిన సమాచారం ప్రకారం చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తేజ్ చిన్నప్పుడే కుటుంబం నుండి విడిపోయి విడిగా హైద్రాబాద్లో జీవిస్తుంటాడు. అనుకోకుండా కలిసిన హీరోయిన్ తో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడ్డ హీరో, ఆమె ప్రేమని ఎలాగైనా పొందాలని, చివరకు ఆమె ప్రేమని దక్కించుకుంటాడు. అయితే అనుకోకుండ ఆమె తేజ్ కు బ్రేక్ అప్ చెపుతుంది.

కాగా అదివరకు అమ్మాయి కుటుంబంలో కొన్ని సమస్యలొస్తాయి. తేజ్ హీరోయిన్ కుటుంబ సమస్యలను తెలుసుకుని తాను వాటిని పరిష్కరించి, ఏవిధంగా ఆమె ప్రేమను తిరిగిపొందాడు అనేది అసలు కథ. ఇక హీరో సాయిధరమ్ తేజ్ మొదటి సారి లవర్ బాయ్ పాత్రలో బాగా నటించాడు అనే చెప్పాలి. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ తండ్రిగా అనీష్ కురువిళ్ళ నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదనిపించేలా ఉంటుంది. అలానే కొన్ని ఫామిలీ ఎమోషన్ తో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఇక ఈ సినిమాలో లోపాలు చాలావరకు ఉన్నాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా దర్శకుడు కరుణాకరన్ చిత్రాన్ని తన పాత చిత్రాల పద్దతిలోనే దీన్ని కూడా తెరకెక్కించాడు అని చెప్పాలి. ప్రేక్షకుడు థ్రిల్ అయ్యే అంశాలు ఏమి లేకపోవడం చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పాలి. ప్రేమకథలను బాగా డీల్ చేయగల కరుణాకరన్ మళ్లి లవ్ స్టోరీ ని తీసుకున్నపుడు, ఆకట్టుకునే కథనం పై దృష్టి పెట్టవలసింది. హీరో హీరోయిన్ల మధ్య రొమంటిక్ సన్నివేశాలు లేకపోవడం, గోపి సుందర్ పాటలు ఆకట్టుకోకపోవడం, ఇక కెమెరా పనితనం కూడా అంతగా బాగాలేధనే చెప్పాలి. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రాన్ని కే ఎస్ రామారావు మంచి నిర్మాణాత్మక విలువలతో తెరకెక్కించారని మాత్రం చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హఫ్ మాత్రం చాలావరకు సాగతీసినట్లు అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా మొత్తం చూస్తే ఒక పాత ప్రేమకథనే దర్శకుడు మళ్లి తెరకెక్కించాడు అనిపించకమానదు. మొత్తంగా చూస్తే రొటీన్ కథ, మరియు కథనాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు అనే చెప్పాలి….

స్లోగా ఉండే రొటీన్ ప్రేమ కథ

Reviewed By 123telugu.com |Rating :2.75/5

అదే పాత కలగలుపు

Reviewed By greatandhra.com |Rating :2.5/5

ఫీల్ లేని ప్రేమకథ

Reviewed By tupaki.com |Rating : 2/5

ఐ హేట్ యు

Reviewed By andhraheadlines.com|Rating : 1.5/5

మరొక డిజప్పాయింట్మెంట్

Reviewed By chitramala.in |Rating : 2/5


 

 


  •  
  •  
  •  
  •  

Comments