ఎన్టీఆర్ బయో పిక్ నుంచి తప్పుకున్న తేజ.. సినిమా ఆగిపోయింది

Wednesday, April 25th, 2018, 08:56:33 PM IST

గత కొద్ది రోజుల క్రితం ఘనంగా ముహూర్థం చేస్కొని చిత్ర షూటింగ్ కి వెళ్ళిన ఎన్టీఆర్ బయో పిక్ ఆగిపోయింది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు డైరెక్టర్ తేజ ప్రకటించారు. “ఎన్టీఆర్‌కు నేను వీరాభిమానిని. కాని.. ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్‌కు న్యాయం చేయలేనేమోనని తప్పుకుంటున్నా. ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్‌కు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశం ఉండొచ్చు..” అని తేజ తెలిపారు.

64 పాత్ర‌ల‌లో బాల‌య్య‌

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఈ చిత్రంలో 64 పాత్ర‌లలో బాల‌య్య క‌నిపించ‌నున్నట్టు తెలుస్తుంది. బాల‌కృష్ణ కుమార్తెలు బ్రాహ్మ‌ణి, తేజ‌స్వి పేర్లు క‌లిసి వ‌చ్చేలా బ్ర‌హ్మ తేజ ప్రొడ‌క్ష‌న్ నిర్మించిన బాల‌య్య ఈ బేన‌ర్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తున్నాడు. వారాహి మ‌రియు విబ్రీ మీడియా కో ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రామ‌కృష్ణ స్టూడియోలో సినిమా ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్రమానికి వెంక‌య్య నాయుడు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. సినిమాటోగ్రాఫ‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా లాంచింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రాఘ‌వేంద్ర‌రావు, బోయపాటి, వినాయ‌క్‌, పూరీ జ‌గ‌న్నాథ్, చార్మి, క‌ళ్యాణ్ రామ్ త‌దిత‌రులు ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. పూజా కార్య‌క్ర‌మం పూర్తైన త‌ర్వాత ఓ పౌరాణిక స‌న్నివేశానికి సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. దుర్యోధనుడి వేష‌దార‌ణ‌లో బాల‌య్య డైలాగు అద‌ర‌గొట్టాడు.

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆ స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. వ‌చ్చే నెల‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌ని ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్నాయి. కీర‌వాణి చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేయ‌నున్నారు. బుర్రా సాయి మాధ‌వ్ చిత్రానికి మాటలు అందించ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments