ఆగష్టు 25న తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డుల ప్రధానం!

Sunday, July 8th, 2018, 11:35:59 AM IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ పార్టీ అక్కడ తొలి సరి అధికారం చేపట్టిన పార్టీగా పేరెన్నిక గన్నది. అంతే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాస్తారని బంగారు తెలంగాణ దిశగా అన్నివిధాలా కృషి, పట్టుదలతో ముందుకు తీసుకు వెళుతున్నారు. కాగా ప్రస్తుతం ఏజే అవెంచర్స్ అనే సంస్థ తెలంగాణ ప్రాంత ప్రజలకు గౌరవ సూచకంగా వివిధ విభాగాల్లో, మగ మరియు ఆడవారికి రాష్ట్ర సార్వభౌమ అవార్డులను ఇవ్వదలిచినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఈ తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ – 2018 అవార్డుల ఈవెంట్ తాలూకు పోస్టర్ ను నిన్న, మంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. కాగా ఈ ఈవెంట్ ను ఎంతో వేడుకగా జరపనున్నట్లు ఏజే అవెంచర్స్ డైరెక్టర్స్ చల్లా జనార్దన్ గారు మరియు అనిత గారు తెలియచేసారు. కాగా ఈ ఈవెంట్ ను అగస్ట్ నెల 25న అతిరధ మహారథుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈవెంట్ కి అసంఖ్యాక ప్రజలు తమకు మద్దతుగా హాజరవ్వాలని వారు విజ్ఞేప్తి చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments