కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి!

Wednesday, August 8th, 2018, 04:12:35 PM IST

తమిళనాడు డీఎంకే అధినేత కరుణానిధి మృతికి దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు అలాగే ఆయన సన్నిహిత రాజకీయ నాయకులు చెన్నైలోని రాజాజీ హాల్‌ కి చేరుకొని కరుణానిధిని చివరి సారి చూస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కడసారి చూడగా రీసెంట్ గా కేసీఆర్ కూడా మహానేతకు ఘన నివాళులు అర్పించారు. ఉదయం చెన్నైకు చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అలాగే తెలంగాణ ఎంపీ కవిత కూడా అంజలి ఘటించారు. నేడు సాయంత్ర సమయంలో కరుణానిధి అంతిమ యాత్ర మొదలవ్వనుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లో జరుగనున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments