అదరగొట్టిన కేటిఆర్… సూది-చక్కర కథ !

Wednesday, September 5th, 2018, 03:18:31 PM IST

తెలంగాణా రాష్ట్ర ఐటీ మినిష్టర్ కల్వకుంట్ల రామారావు గారు షాద్ నగర్ లో నిర్వహించిన “ప్రజా ఉత్సవ సభ” లో కాంగ్రెస్ పార్టీ నేతల మీద తనదైన శైలిలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. కాంగ్రెస్ నేతలు అధికారం లోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే హామీలను ఇస్తున్నారని. వెయ్యి రూపాయల ఫించనుని రెండు వేలు చేస్తాం, పదిహేను వందల ఫించను ఇస్తే మేము మూడు వేలు ఇస్తామని, రెండులక్షల రుణమాఫీ చేస్తాం అని నోటికి ఏది వస్తే అది చేస్తాం అని చెప్పుకుంటూ పోతున్నారని, గుర్తు చేస్తూ ఒక కథ చెప్పారు..

“కొన్ని ఏళ్ళ క్రితం ఒక టైలర్ ఉండేవాడు, పండుగల సమయం వచ్చేసరికి చాలా బట్టలు కుట్టవలసి వచ్చింది రాత్రియంబవళ్ళూ కుడుతుంటే ఒక రోజు సాయంత్రం ఆ సూది విరిగి కింద పడిపోయింది ఎంత వెతికినా కనిపించక పోయేసరికి దేవుణ్ణి ప్రార్ధిస్తూ దేవుడా సూది దొరికితే నీకు ఐదు కిలోల చక్కర ఇస్తాను అని మొక్కుకోగా వాళ్ళ భార్య ఏమయ్యా నీకు బుద్ధి ఉందా ఐదు పైసల సూది కోసం ఐదు కిలోల చక్కర ఇస్తాను అంటున్నవ్ అని అంది అప్పుడు దానికి ఆ టైలర్ ముందు ఈ సూది అయితే దొరకని .. ఆ తర్వాత ఆ దేవుడు వచ్చేది ఉందా అడిగేది ఉందా అని అన్నాడు అని అన్నారు”

ఇదే తరహాలో కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు పడ్డాక ప్రజలను పట్టించుకోడానికి వాళ్ళేం వస్తారు అని ఒక్క నాయకుడు కూడా దొరకడు అని, వాళ్ళు మీ రాష్ట్రం లో ఆ రోడ్డు ఎందుకు ఇలా ఉంది అలా ఉంది అని అడిగిన ప్రశ్నలకు మేము వచ్చి నాలుగేళ్లే అయ్యిందని మీరు వచ్చి యాభై ఏళ్ళు అయినప్పుడు ఏ రాష్ట్రం లోను ఎలాంటి సమస్య కూడా ఉండి ఉండకూడదు కదాని ఎద్దేవా చేశారు..

  •  
  •  
  •  
  •  

Comments