తెలంగాణా లో “మహాకూటమి”కి వేదిక సిద్ధం అయ్యిందా?

Tuesday, September 11th, 2018, 11:00:22 AM IST

తెలంగాణా రాష్ట్రం లో రాజకీయాలు రోజు రోజుకి మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తు ఎన్నికలు ఉంటాయి అన్న ప్రచారం మేరకు అక్కడ గల ప్రతి ఒక్క పార్టీ తమ ఉనికిని నిలుపుకునేందుకు వారి వారి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే నిన్న అనుకున్న విధంగానే అక్కడ ఒక్కో పార్టీ స్వతంత్ర్యంగా పోటీ చెయ్యకుండా కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

అయితే తెలంగాణా లోని తెరాస తప్ప మిగతా అన్ని పార్టీలు కలిసి “పొత్తు” అని కాకుండా “మహాకూటమి” అనే పేరిట ఈ ముందస్తు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఏ ఏ పార్టీలు ఈ మహాకూటమి లో భాగస్వామ్యం కానున్నాయి అనేది చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సిపిఐ పార్టీకి చెందిన చానా వెంకటరెడ్డి గారు ఈ పార్టీలు మహా కూటమిలో పాలు పంచుకోనున్నాయి అని టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ మరియు జనసమితి పార్టీలు ఒక మహాకూటమి గా ఏర్పడబోతున్నాయి అని తెలిపారు. అంతే కాకుండా తెరాస మరియు బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్ధం కాబోతున్నాయా..? అని అన్నట్టు కూడా మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..

  •  
  •  
  •  
  •  

Comments