షాక్ నుండి తేరుకుని అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ !

Sunday, October 21st, 2018, 12:41:04 PM IST

ముందస్తు ఎన్నికల్ని ప్రకటించి 105 మంది అభ్యర్థుల తొలి దశ జాబితాను వదిలి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు కేసిఆర్.  ఎన్ని అసమ్మతులు ఎదురైనా అభ్యర్థులను మార్చకుండా ముందుకెళుతూ ప్రచారాన్ని సైతం ముమ్మరం చేసిన ఆయన వేగానికి ఇతర పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, బీజేపీలు ఖంగుతిన్నాయి.  ఆయన యాక్షన్ ప్లాన్ ను అర్థం చేసుకుని, ముందగుడు వేయడానికి ఆ పార్టీలు చాలా కష్టపడ్డాయి.

కేసిఆర్ ఆశావహులను, సిట్టింగ్ లను కాచి వడపోసి తయారుచేసిన జాబితా బలంగా ఉండటంతో వారికి పోటీగా తమ అభర్ధుల ఎంపికలో తలకిందుల తపస్సు చేస్తున్నాయి ఆయా ప్రత్యర్థి పార్టీలు.  కేసీఆర్ ఇచ్చిన ఈ షాక్ నుండి బీజేపీ కాస్త ముందుగా తేరుకుంది.  నిన్ననే తమ అభ్యర్థుల తొలి దశ జాబితాను ప్రకటించారు.  ఇందులో మొత్తం 38 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 3 మహిళలు, 3 ఎస్సీ, 6 ఎస్టీ, 3 ఎంబీబీఎస్ డాక్టర్లు అభర్ధులుగా ఉన్నారు.

మరోవైపు టీడీపీ, కాంగ్రెస్,టిజెస్ఎస్ ల మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదు.  టికెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉండటం, చాలా చోట్ల కేసిఆర్ అభ్యర్థులకు ధీటుగా నిలబడే నేతలు కరువవడం, ఏయే పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో క్యాండిడేట్ల ఎంపిక కూటమికి క్లిష్టంగా మారింది.  ఇకపోతే బీజేపీ ప్రకటించిన జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

• పినపాక – సంతోష్ కుమార్ చందా

• సత్తుపల్లి – నంబూరి రామలింగేశ్వర రావు.

• ఆందోల్ – బాబు మోహన్

• కోరుట్ల – డా. వెంకట్

• ధర్మపురి – కన్నం అంజయ్య

• బెల్లంపల్లి – ఈమాదీ

• మానకొండూరు – గడ్డం నాగరాజు

• కార్వాన్ – టి. అమర సింగ్

• మేడ్చల్ – పి. మోహన్ రెడ్డి

• కల్వకుర్తి – ఆచారి

• బోద్ – మాదవి రాజు

• షాద్ నగర్ – శ్రీవర్ధన్ రెడ్డి

• భద్రాచలం – కుంజా సత్యవతి

• ముదోల్ – రమాదేవి

• భూపాలపల్లి – కీర్తి రెడ్డి

• పరకాల – డా. విజయ్ చందర్ రెడ్డి

• దుబ్బాక – రఘువందన్ రావు

• మునుగోడు – జి. మనోహర్ రెడ్డి

• సూర్యాపేట్ – సంకినేని వేంకటేశ్వర రావు

• ఆర్మూర్ – డా. వినయ్ కుమార్ రెడ్డి

• నిజామాబాద్ (రూరల్) – ఆనంద్ రెడ్డి

• కరీంనగర్ – బండి సంజయ్

• మక్తల్ – కొండయ్య

• ఆదిలాబాద్ – పాయల్ శంకర్

• పాలేరు – శ్రీధర్ రెడ్డి

• అచ్చంపేట – మల్లేశ్వర్

• గద్వాల్ – వెంకటాద్రి రెడ్డి

• నారాయణపేట – రతన్ పాండు రెడ్డి

• మల్కాజగిరి – రామచంద్రరావు (ఎమ్.ఎల్.సి)

• అంబర్ పేట – కిషన్ రెడ్డి

• ఉప్పల్ —ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

• తాండూరు – రవిశంకర్ పటేల్

• ఘోషామహల్ – రాజా సింగ్

• ముషీరాబాద్ – డా. లక్ష్మణ్

• పెద్దపల్లి – జి. రామకృష్ఞా రెడ్డి

• ఎల్.బి. నగర్ – పేరాల శేఖర్ రావు

• ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

• దేవర కదర – ఎగ్గాని నరసింహులు

  •  
  •  
  •  
  •  

Comments