సిద్దమవుతున్న తెలంగాణ బీజేపీ.. భారీ బహిరంగ సభకు ప్లాన్!

Monday, September 10th, 2018, 08:28:32 AM IST

తెలంగాణలో పట్టు సాధించాలని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న భారత జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసినా పట్టు దొరకడం లేదు. కొన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను పదిలంగా ఉంచుకుంటు వస్తున్న ఆ పార్టీ ఈ సారి ఎలాగైనా తెలంగాణలో ప్రతిపక్ష స్థాయిలో అయినా ఉండాలని కసరత్తులు చేస్తోంది. గత ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన బీజేపీ ఈ సారి ఒంటరిగానే పోటీకి దిగనుంది. టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే సిద్దమవుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు.119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసి తమ బలాన్ని నీరూపించుకుంటామని అన్నారు. ఇకపోతే ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఎన్నికల ప్రణాళికలను రచిస్తోంది. టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టినట్లు చెబుతూ.. మొదట 50 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇక పాలమూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రానున్నట్లు బిజేపి నేతలు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments