నవంబర్ లో టిబడ్జెట్?

Monday, October 20th, 2014, 11:09:38 AM IST

trs-kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో శనివారం బడ్జెట్ రూపకల్పన పై మూడు గంటలపాటు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నవంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ప్రతిపాదించాలని సూచించారు. అలాగే బడ్జేట్ లో ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ సాంప్రదాయానికి విరుద్ధంగా ఆర్ధికమంత్రి తయారు చెయ్యాల్సిన బడ్జెట్ ను తానే స్వయంగా రూపొందించడానికి నడుంబిగించారని విమర్శలను ఎదుర్కొన్నారు. కాగా ఆగష్టులో విడుదల చెయ్యాల్సిన బడ్జెట్ ఇంకా రూపొందించకపోవడంతో పలు వర్గాల నుండి తెరాస ప్రభుత్వం ఘాటు విమర్శలనే ఎదుర్కొంది. ఈ నేపధ్యంగా ఎన్నికల హామీలను పొందుపరుస్తూ బడ్జెట్ నవంబర్ కల్లా రూపొందించాల్సిందిగా కెసిఆర్ ఆదేశించారు. అయితే ఎన్నికల హామీలను అన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేవని అధికారులు పేర్కొనడంతో కెసిఆర్ కనీసం ముఖ్యమైన హామీలపైన అయినా శ్రద్ధ పెట్టమన్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం త్వరగా బడ్జెట్ ను రూపొందించి ఇప్పటి వరకు ఉన్న విమర్శలకు చెక్ పెడతారని ఆశిద్దాం.