ఎలక్షన్ 2019: లోక్ సభ ఎన్నికలు అయ్యేంతవరకు మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా ..?

Tuesday, February 12th, 2019, 10:56:20 AM IST


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది, ఇంకా మంత్రివర్గం ఏర్పాటవ్వలేదు. దీంతో పాలన ఎక్కడిక్కడే ఆగిపోయింది , ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో ఆగిపోయిన పెద్ద ఫైల్స్ అన్ని ముందుకు కదల్లేదు. రోజువారీ పాలనకు ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ, కొత్త పనులు ప్రారంభం కాక, పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభం కాక తెలంగాణలో పాలన ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది కాలానికే మంత్రి వర్గ ఏర్పాటు పూర్తి కావాల్సినప్పటికీ కొన్ని రోజలు యాగం అని, ఇంకొన్ని రోజులు పంచాయితీ ఎలక్షన్లనీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆ మధ్య ఫిబ్రవరి 8 లేదా 9తేదీలలలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందంటూ వార్తలొచ్చాయి కానీ, జరగలేదు. దీంతో మంత్రిపదవి మీద ఆశ పెట్టుకున్నవారు పరిస్థితి అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీచర్లు, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఏంన్నికలు ముగియాలంటే ఇంకో మూడు నెలలు పడుతుంది కాబట్టి, అప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ ఊసు ఉండబోదని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం పలు శాఖలకు అధికారులేక ఇన్ చార్జీలతో నెట్టుకొచ్చినట్లే లోక్ సభ ఎన్నికలు ముగిసేంతవరకు మరో మూడు నెలలు ఇలాగే పాలన కొనసాగాల్సిందే అన్నమాట. ఇక అప్పటిదాకా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు పని లేనట్లే.