తెలంగాణ స్పీకర్ కు తప్పిన ప్రమాదం

Saturday, June 9th, 2018, 09:41:47 PM IST

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డు ప్రమాద నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కలకలం సృష్టించిన ఈ ఘటన తెరాస పార్టీలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. తృటిలో ప్రమాదం తప్పిందని ఎవరు ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. మధుసూధన చారి తన సొంత నియోజకవర్గమైన గణపురంలో పల్లె నిద్ర అనంతరం తీరిగు ప్రయాణం అవుతుండగా దారి మధ్యలో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.

భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో మధుసూధన చారి కాన్వాయిలో వెళుతుండాగా ఒక లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అయితే కారు కొంత డ్యామేజ్ అయినా స్పీకర్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. వెంటనే లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాద జరిగిందని తెలుస్తోంది. ఇక స్పీకర్ కు జరిగిన ఘటన గురించి తెరాసా అదిష్టాన నాయకులూ అడిగి తెలుసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments