యాదగిరి గుట్టకు టిటిడి శోభ!

Friday, October 17th, 2014, 09:51:31 PM IST

kcr13
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరి గుట్టపై శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి గుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రెండేళ్లలో దీన్ని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో టెంపుల్ సిటీగా మారుస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ యాదగిరి గుట్టలో వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఇకమీద నుండి అమలు చేస్తామని కెసిఆర్ తెలిపారు. ఇక రెండువేల ఎకరాల్లో తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, కళ్యాణ మండపాలు, కాటేజీలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గుట్ట కింద చెరువులు, గుట్టలు కలిపి 400ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ వివరించారు. ఇక వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు ఏర్పాటు చేస్తామని, యాదగిరి గుట్టను టిటిడి తరహాలో అభివృద్ధి చెయ్యడానికి హైదరాబాద్ లోని కార్పోరేట్ సంస్థలకు పిలుపునిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు.