ఇప్పుడు కాంగ్రెస్ కూడా టీడీపీ దారిలోనే.. టీఆరెస్ పై కన్ను

Wednesday, October 25th, 2017, 08:40:40 AM IST

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే వామ పక్షలకు ఇప్పుడు సవాల్ గా మారింది. ఏ పార్టీ ఇప్పుడు అనుకున్నంత స్ట్రాంగ్ గా లేదు. ప్రతి పక్ష పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఒకప్పుడు గ్రామాల్లో కూడా చాలా ఫెమాస్. కానీ ఇప్పుడు కేసీఆర్ తన పాలన ఆలోచనతో టీఆరెస్ కి ప్రతి గ్రామంలో గుర్తింపు దక్కేలా చేస్తున్నారు. ఏ మాత్రం తడబడకుండా టీఆరెస్ నేతలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.

అయితే కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు అయ్యే పనికాదు. కాంగ్రెస్ లో నాయకులు కరువైతే టీడీపీ నాయకులు కనిపించకుండా పోయారు. కార్యకర్తలు మొత్తం టీఆరెస్ లోకి వెళ్లిపోయారు. ఇక మొన్నటి వరకు కొడంగల్ టైగర్ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి కూడా టీడీపీ పై హాట్ కామెంట్స్ చేస్తుండడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది కీలక నేతలు కేసీఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంత మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనని కనీసం టీఆరెస్ లో ఉంటే ఏదైనా గుర్తింపు దక్కవచ్చని అనుకుంటున్నారట. ఇక రీసెంట్ గా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని చాలా మంది కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అలాగే మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.