ముందస్తు ఎన్నికల ఎఫెక్ట్.. టీ కాంగ్రెస్ మేనిఫెస్టో!

Thursday, September 6th, 2018, 02:00:08 AM IST

ఓ వైపు టీఆరెస్ పార్టీ నిరంతరంగా జరుపుతున్న సమావేశాలకు ఇతర పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. టీఆరెస్ హడావుడి చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదనే టాక్ ఇప్పటికే బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎంతకైనా మంచిదని ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇంకా పార్టీ టికెట్టు నిర్ణయాలు పెండింగ్ లోనే ఉన్నప్పటికీ మేనిఫెస్టోని మాత్రం రెడీ చేసేసింది. గాంధీ భవన్ లో సమావేశం టీ కాంగ్రెస్ నేతలు ఓటర్లను ఆకర్షించే విధంగా వరాలను కురిపించారు. ప్రతి విషయాన్నీ టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ మీడియా కు వివరించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలోని అంశాలు:

– బిపిఎల్ కుటుంబాలకు ఏడాదికి 6 ఎల్పీజీ సిలిండర్లను ఉచిత పంపిణి
-ప్రతి బాలికకి ఉచితంగా సైకిల్స్
-దివ్యాంగుల పెళ్లికి రెండు లక్షల ఆర్థిక సాయం –
-రూ. 500 కోట్లతో గల్ఫ్ బాధితుల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గల్ఫ్ లో

-మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
-బిపిఎల్ కుటుంబాలకు ప్రమాద భీమా
-అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు
-కల్యాణ లక్ష్మి, బంగారు తల్లి పథకాలను పునరుద్దరించి మరింత మెరుగ్గా అమలుచేయట
-అధికారంలోకి రాగానే మిడ్ మానేరు నిర్వాసితులను డబుల్ బెడ్ రూం ఇళ్లు
-బిసి, మైనారిటీల జనాభా ప్రాతిపదికన సబ్ కమిటీ ఏర్పాటు.
– మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్
-పిడిఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) వ్యవస్థను మరింత మెరుగపర్చనున్నట్లు తెలిపారు.
-అమ్మ హస్తం పథకం కింద 9 రకాల సరుకులు అందజేయుట.
– ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో రూపియికి కిలో కిందనే ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణి.
– దళిత, గిరిజనులకు ఉచితంగా రేషన్ సరుకులు
– రేషన్ డీలర్ల కమీషన్ ను పెంచనున్నట్లు తెలిపారు. అదే విధంగా క్వింటాల్ బియ్యంపై డీలర్లకు వంద రూపాయల కమీషన్ ఇస్తామని హామీనిచ్చారు.
– కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిన 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తాం.
– ఇళ్లు లేని కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం
-,ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు మరో లక్ష అదనం
– ఇపుడున్న ఇందిరమ్మ ఇళ్లకు మరో గదిని ఏర్పాటు చేసుకోవడానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం.
– విద్యుత్ విషయంలో పలు మార్పులు
– దళిత, గిరిజనులకు గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
– మొత్తం డొమెస్టిక్ యూజర్స్ కి కరెంట్ చార్జీల తగ్గించే ప్రయత్నం
– దేవాలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

  •  
  •  
  •  
  •  

Comments