కాంగ్రెస్ కి ఎనర్జీ వచ్చింది.. పాత నేతలు కూడా వచ్చేస్తున్నారు

Tuesday, October 31st, 2017, 08:48:31 AM IST

చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైందని అనిపిస్తోంది. ఎలక్షన్స్ కూడా దగ్గరపడుతుండటంతో నాయకులు ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. ఇక ఇన్ని రోజులు పదవి దక్కకుండా ఉన్న నేతలు కూడా అసలు ప్రణాళిలను సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి – టీడీపీ ల మధ్య ఎంతవరకు పోటీ ఉంటుందో ఎవరు కరెక్ట్ గా అంచనా వేయలేకపోతున్నారు. ఇక తెలంగాణాలో నెక్స్ట్ సీఎం కూడా కేసీఆర్ అని కొందరు ప్రతిపక్ష నాయకులనే అంటున్నారు.

కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా వెనుకడుగు వేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఇది వరకే చాలా సార్లు చెప్పింది. ఎలాగైనా ఈ సారి తప్పకుండా కేసీఆర్ కి పోటీని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ కీలక నేతలు అధికార పార్టీలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కి పోటీని ఇవ్వాలని కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఇక మరికొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ నేతలతో కలవనున్నారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలు కూడా కాంగ్రెస్ తో కలవనున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి రాకతో ఇప్పుడు హస్తం నేతలకు మంచి ఎనర్జీ వచ్చింది. దీంతో ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ ని బలపరిచేందుకు ముందుకు వస్తున్నారు. మరి కేసీఆర్ కు ఎంతవరకు పోటీని ఇస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments