ఎంసెట్ టాపర్స్ లిస్ట్ లో అబ్బాయిలే ఎక్కువ.. పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం!

Saturday, May 19th, 2018, 04:08:44 PM IST


ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూసిన తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రానే వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఫలితాల తేదీలో కాస్త అపోహలు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న సమయానికి ఫలితాలు విడుదల అవుతాయని తెలిపి నేడు విడుదల చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఎంసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. అగ్రికల్చర్‌ పరీక్షకు 66,857 మంది విద్యార్థులు హాజరుకాగా ఎంసెట్‌ వ్యవసాయం, ఫార్మాలో 90.72% ఉత్తీర్ణత నమోదైంది.

టాపర్ల వివరాలు

అగ్రికల్చర్ విభాగంలో.. టాపర్లు

మొదటి ర్యాంక్ – నమ్రత (కర్నూలు)
రెండో ర్యాంక్ – సంజీవ్ కుమార్ రెడ్డి,
మూడో ర్యాంక్ – ఆర్యన్ (నిజామాబాద్),
నాల్గో ర్యాంక్ – సంజన (మేడ్చల్)

ఇక ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,36,311 మంది విద్యార్థులు హాజరుకాగా 78.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంజినీరింగ్‌ విభాగంలో.. టాపర్లు

మొదటి ర్యాంక్ – వెంకటపాణి వంశీనాథ్ (రంగారెడ్డి),
రెండో ర్యాంక్ -మైత్రేయ (రంగారెడ్డి),
మూడో ర్యాంక్ – శ్రీవర్థన్ (రంగారెడ్డి),
నాల్గో ర్యాంక్ – హేమంత్ కుమార్ (వైజాగ్),
ఐదో ర్యాంక్ – మదన్ మోహన్ రెడ్డి ( కృష్ణాజిల్లా),
ఆరో ర్యాంక్ – భరత్ (శ్రీకాకుళం)

ఫలితాల కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments