అన్ని జిల్లాల‌కు ఈవీఎంలు, వివి ఫ్యాట్‌లు

Saturday, September 15th, 2018, 02:30:29 AM IST


కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈవీఎంలు ఎక్కడకు వెళ్తున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాకే ఎన్నిక‌ల‌ తేదీల ప్రకటిస్తార‌ని తెలుస్తోంది. ఆర్నెళ్లలో ఎన్నిక‌లు జ‌ర‌గాలి. అంటే యుద్ధ ప్రాతిప‌దిక‌న అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే కేంద్ర బృందం తెలంగాణ‌కు వ‌చ్చి ప‌రిస్థితుల్ని స‌మీక్షించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఇక ఫైన‌ల్‌. ఎన్నిక‌ల‌కు 1జ‌న‌వ‌రి 2018 ఎన్నికల జాబితా ఉప‌యోగించాల‌ని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ప్రారంభించామ‌ని అధికారులు చెబుతున్నారు. ఆరునెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటే సవాళ్లు ఉన్నాయి. ఎలక్ట్రో రోల్స్ అన్ని రాజకీయ పార్టీల కు పంపించామ‌ని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 100 శాతం కొత్త ఈవీఎం మిషన్ లు వాడుతామ‌ని తెలిపారు.

భూత్ లెవెల్ లో గత ఎన్నికల్లో 14 వందల ఓటర్లు ఉన్నారు కానీ ఇప్పుడు ఈవీఎంలు పెంచే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్ర‌తి జిల్లా కలెక్టర్ లకు ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పించాలని చూచించామ‌ని అధికారులు తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్గిస్తున్నారు.

ఎన్నికల ఏర్పాట్లు ఇఆర్వో లు పర్వవేక్షిస్తారు. 18 వరకు అన్నిజిల్లాల కు మిషన్ లను పంపించాలి అనుకున్నాం కానీ 20వ తేదీ నాటికి అన్ని జిల్లాలలకు చేరుకుంటాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 32574 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. వీటికి 52100 బ్యాలెట్ యూనిట్ లు అవసరం అవుతాయి. ఒక్క బ్యాలెట్ యూనిట్ లో నోటా తో కలిపి 16 అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎన్నికలకు 41000 కంట్రోల్ యూనిట్స్, 44 వేల వివి ఫ్యాట్స్ అవసరం అవుతాయని అంచ‌నా వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపోయేంత పోలీస్ పోర్స్ ఉందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments