ఎన్నిక‌లకు యుద్ధ స‌న్నాహ‌కమిది!

Monday, September 10th, 2018, 01:07:00 PM IST

అవును.. ర‌ణ‌రంగానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రానికి ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణ‌లో స‌న్నివేశం ఎలా ఉందో ప‌రిశీలించేందుకు పైవాళ్లే దిగొస్తున్నారు. కేసీఆర్ ఇలాకాలో అంద‌రి కంటే ముందే జేగంట మోగ‌డం ఖాయ‌మైంది. ఆ మేర‌కు కీల‌క స‌మాచారం దిల్లీ నుంచి లీకైంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం… రేపు(సెప్టెంబ‌ర్ 11న‌) దిల్లీకి తెలంగాణ‌ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప‌య‌న‌మ‌వుతున్నారు. ఆయ‌న వెళ్ల‌డానికి కార‌ణం .. రాష్ట్రంలో ఎన్నికల జేగంట మోగుతోంద‌నే సంకేత‌మేన‌ట‌. రానున్న 6 నెలలు అంటున్నా చాలా ముందే ఎన్నికలుంటాయి కాబ‌ట్టి, ఎన్నికల కమిషన్ అస‌లు పనులు మొదలు పెట్టేస్తోందిట‌. ఏవిఎం, వివి పాట్ లు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఈ మంగ‌ళ‌వారం నాడు జాతీయ ఎన్నికల డిప్యూటీ కమిషన్ అధికారులు హైదారాబాద్‌కు వస్తున్నారు. ఇక్క‌డ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అని ప్ర‌తిదీ పరిశీలించి ఎన్నికల కమిషన్ కు వివరిస్తారు.ఆ తరువాత ఎన్నికలపై ఓ షెడ్యూల్ ఖ‌రారు చేసే అవ‌కాశం ఉందిట‌. రెండు రోజుల పాటు కేంద్ర బృంద పర్యటన ఉంటుంద‌ని తెలిసింది. 11 న సాయంత్రం 6.30 కి గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలతో కేంద్ర బృందం సమావేశం అవుతుంది. అటుపై రాత్రికి రాష్ట్ర ఎన్నికల సంఘం తో బేటీ ఉంటుంది. 12వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ లోని కలెక్టర్లు, ఎస్పీ లతో బేటీ కార్య‌క్ర‌మాలు ఉంటాయి. సాయంత్రం సీఎస్, డిజిపి తో పాటు ఇతర ఉన్నతాధికారుల తో సమావేశం నిర్వ‌హిస్తారు. దీంతో ముంద‌స్తు సైర‌న్ మోగించిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు 12వ తేదీ సాయంత్రం 5.30 తర్వాత జ‌రిగే ప్రెస్ బ్రీఫింగ్‌లో చాలా విష‌యాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంద‌ని తెలిసింది. ఈ వార్త‌తో ఇటు తెలంగాణ‌లో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎంతో హై ఎల‌ర్ట్‌తో ఉన్నాయి. ఎవ‌రికి వారు యుద్ధ స‌న్నాహ‌కాల్లోనే ఉన్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments