డిసెంబర్ లోనే తెలంగాణ ఎలక్షన్స్?

Friday, September 7th, 2018, 10:49:48 AM IST

కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీని రద్దు చేస్తూ ముందస్తు ఎన్నికలకు సిద్దమైన కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇకపోతే తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగనున్నాయి అనే దానిపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) వివరణ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈసీ అధికారులు చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు.

నేడు ఉన్నతాధికారులతో జరిగే ఈ మీటింగ్ లో తెలంగాణాలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్ లోనే నిర్వహిస్తే బావుంటుందా అనే అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈసీ తీసుకునే నిర్ణయం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు నెలకొనే అవకాశాలు ఉంటాయి. ముందుగా పండుగలు అలాగే పరీక్షలు వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. కేసీఆర్ ముందుగానే ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం అసెంబ్లీ రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు అందజేశారు. ఇక తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నరసింహన్ కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments