బ్రేకింగ్ స‌ర్వే రిజ‌ల్ట్స్ అవుట్.. టీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయో.. తేల్చి చెప్పిన – ది ఎకానామిక్స్ టైమ్స్..!

Thursday, October 25th, 2018, 10:45:15 AM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ప‌లు స‌ర్వేలు తెర‌పైకి వ‌చ్చి తెలంగాణ‌ రాజ‌కీయవ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే వ‌చ్చిన ప‌లు స‌ర్వేలు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెలంగాణ విజ‌యం సాధిస్తుంద‌ని తేల్చ‌గా.. తాజాగా జాతీయ ప‌త్రిక‌ ది ఎకనామిక్ టైమ్స్ మాత్రం నిర్వ‌హించిన స‌ర్వేలో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేంగా రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ఖు 38 నుండి 42 సీట్లు మాత్రం వ‌స్తాయ‌ని చెప్పి తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపింది.

తెలంగాణ‌లో ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో మ‌హాకూట‌మికి 65 నుండి 75 సీట్ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం తెలంగాణ‌లో రెండు, మూడు సీట్లు మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఎంఐఎంకు 6 నుండి 12 వ‌ర‌కు సీట్లు గెల్చుకునే అవకాశం ఉంద‌ని ది ఎకానామిక్ టైమ్స్ తేల్చింది. ఇక రాష్ట్రం విడిపోయాక తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌నున్నార‌ని.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళిన ఆప‌ధ్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జ‌బ‌ర్ధ‌స్త్ షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని ది ఎకాన‌మిక్ టైమ్స్ స‌ర్వే తేల్చేసింది. మ‌రి ఈ స‌ర్వేలో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments