ఏపీలో గెలిచే పార్టీ ఇదే : తెలంగాణ మాజీ ఉన్న‌తాధికారి సంచలనం..!

Monday, May 13th, 2019, 09:27:04 PM IST

మే 23న వెలువ‌డ‌నున్న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం త‌ధ్య‌మ‌ని, మ‌ళ్లీ.. మ‌ళ్లీ తెలుగుదేశం ప్ర‌భుత్వం రావ‌డంతో ప్ర‌జ‌లకు సంక్షేమ ఫ‌లితాలు అంద‌నున్నాయ‌ని మాజీ అధికారి ఒక‌రు చెబుతున్నారు. ఈ వ్యాఖ్య‌లు చేసింది మ‌రెవ్వ‌రో కాదు.., తెలంగాణలో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌లు కీల‌క శాఖ‌ల్లో విధులు నిర్వ‌హించిన వ్య‌క్తి చెబుతున్న మాట‌లివి. చంద్ర‌బాబు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా, టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌బోతుంద‌ని ఆయ‌న ఆధారాల‌తో స‌హా చెబుతున్నారు.

ఇలా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు క‌దా..! ఇంత‌కీ ఆయ‌న టీడీపీకి ఫేవ‌ర్ అనుకుంటే పొర‌పాటు ప‌డ్డ‌ట్టే.., ఆయ‌న ప‌క్కా తెలంగాణ వాది. అందులోను కేసీఆర్‌కు వీర విధేయుడు. అటువంటి వ్య‌క్తి టీడీపీకి అనుకూలంగా మాట్లాడ‌ట‌మేంటి..? అన్న అనుమానం ఆయ‌న్ను క‌లిసిన ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు కూడా వ‌చ్చింది.

ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు వ‌చ్చిన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అడ్డ‌గా, యాంటీ టీడీపీ ఓట్లు టీడీపీకి ప‌డ్డాయ‌న్న బ‌హిరంగ నిజాన్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో యాంటీ టీఆర్ఎస్ ఓట‌ర్లంతా రోడ్ల‌పైకి వ‌చ్చి నానా ర‌చ్చ చేసిన సంగ‌తి తెలిసిందే. సేమ్ టు సేమ సిట్చ్యువేష‌న్ కూడా ఏపీలో జ‌రిగిన విష‌యాన్ని ఆ మాజీ ఉద్యోగి గ‌ర్తు చేశారు.

ఏపీలో ఏప్రిల్ 11న ముగిసిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన రిజ‌ల్ట్‌పై రేకెత్తుతున్న ఆందోళ‌న‌ను, టెన్ష‌న్‌ను త‌ట్టుకోలేక వివిధ పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధులు ఫారెన్ దేశాల‌కు టూర్‌లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రికొందరైత ఫలితాలు వెలువ‌డ‌క ముందే ఎగ్జిట్‌పోల్స్ ఎప్పుడొస్తాయా..? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క వ్య‌క్తిగా ప‌నిచేసిన ఉద్యోగి, ప్ర‌జ‌ల ప‌ల్స్ తెలిసిన వ్య‌క్తిగా వెల్ల‌డించిన ఫ‌లితాల ప్ర‌కారం ఏపీలో టీడీపీ రావ‌డం క‌న్ఫామ్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.