జీఎస్టీ రాబడిలో తెలంగాణ ఫస్ట్..!

Monday, March 12th, 2018, 03:48:51 PM IST


రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) రాబడులు నెమ్మదిగా స్థిరస్థాయిలో పెరుగుగుతూ వస్తున్నాయి. గత ఏడాది వ్యాట్ రాబడితో పోలిస్తే జీఎస్టీ రాబడి ఏకధాటిగా ఘననీయమైన స్థాయిలో నిలిచాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు రాబడులు 19.57 శాతం పెరిగినట్టు తాజా నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు 17 శాతం వృద్ధిరేటును సాధించలేదని సమాచారం. ఒక్క తెలంగాణ మాత్రమే 19 శాతం పైగా వృద్ధిరేటును సాధించి మరోసారి సొంత ఆదాయాల అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిచింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక నవంబర్‌లో స్టేట్‌జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) దాదాపు వందకోట్లు తగ్గినా ఆ మేరకు కేంద్రం నష్టపరిహారం ఇచ్చింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు వ్యాట్‌ద్వారా రూ.19,556.54 కోట్ల రాబడి వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈసారి అదే సమయానికి జీఎస్టీ+వ్యాట్ ద్వారా 23,383.49 కోట్ల ఆదాయం సమకూరింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి నెల జూలైలో ఆదాయం తగ్గినప్పటికీ ఆగస్టు నుంచి బాగా పుంజుకుంది.

గత ఏడాది వ్యాట్ వసూళ్లతో పోలిస్తే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాబడి 19.57 శాతానికి పెరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోరాబడులు వరుసగా 5.68 శాతం, 14.67, 26.34, రూ. 25.69,13.89, 15,46, 34.37 శాతానికి పెరిగాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, మద్యంపై వసూలు చేసిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్)వాటా రూ. 10,573 కోట్లుగా నిలిచింది. జీఎస్టీ ద్వారా రూ.12,810 కోట్ల ఆదాయం నిజంగానే విశేషం అని చెప్పుకోవాలి. గత ఏడాది 2016-17లో వ్యాట్ ద్వారా మొత్తం రాబడి రూ. 31,322 కోట్లు రాగా ఈసారి 2017-18 ఫిబ్రవరి నాటికే ఆదాయం 37,428 కోట్లు దాటింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల రాబడి పెరిగింది.

telangana Got First Position in GST Revenue…

  •  
  •  
  •  
  •  

Comments