తెలంగాణ ప్రభుత్వం రంజాన్ కానుక.. 33కోట్లతో..

Thursday, May 31st, 2018, 05:45:16 PM IST

ప్రతి పండగకు ప్రజలను సంతోషపరిచే విధంగా ఎదో ఒక ఆలోచనతో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ సారి రంజాన్ సందర్భంగా మరో సరికొత్త ఆలోచనతో మైనారిటీలను ఆకర్షించింది. రంజాన్ సందర్బంగా ఇఫ్తార్ విందును ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని ప్రతి మజీదుకు లక్ష రూపాయలు విందు కోసం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న 800 మజీదులు ఉన్నాయి. అందులో 400 మజీదులు నగరంలో ఉండగా మిగతా నాలుగు వందలు వివిధజిల్లాలలో ఉన్నాయి.

అయితే రంజాన్ ససందర్బంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణా ప్రభుత్వం 35 కోట్లను ప్రకటించిందని, ఇఫ్తార్ విందుకోసమే 15 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి మజీదుకు లక్ష రూపాయలతో పాటు 500 గిఫ్ట్ ప్యాకుల రూపంలో బట్టలను పంపించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అదే విధంగా వచ్చే నెల 8న
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌ – ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందును ప్రత్యేకంగా నిర్వహించున్నారు. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందించినట్లు తెలిపారు. ఇక విందులో ఎలాంటి అంతరాయాలు కలగకుండా భారీ ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు.