కేసీఆర్ భయపడ్డారా..నయీమ్ కేసు తారుమారు కావడానికి కారణం..?

Thursday, December 29th, 2016, 10:28:44 PM IST

nayeem
నయీమ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది.నయీమ్ తో ఎటువంటి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు సంబంధాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిపిఐ నాయకుడు నారాయణ హై కోర్ట్ లో దాఖలు చేసిన ప్రజావ్యాజ్యం కు తెలంగాణ హోమ్ శాఖ కౌంటర్ ని దాఖలు చేసింది. ప్రముఖులు, రాజకీయనాయకులెవరికీ నయీమ్ తో అంబండలు లేవని తేల్చేసింది.మాజీ డిజిపి కి నయీమ్ తో సంబంధాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హోమ్ శాఖ తెలిపింది. అలానే దావూద్ తో నయీమ్ కు సంబంధాలు ఉన్నాయనడానికి కూడా ఆధారాలు లేవని తేల్చింది. నక్సల్స్ సమాచారాన్ని నయీమ్ అందించినందుకు అతనికి రూ 25 లక్షలు ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు అవాస్తవాలని తేల్చింది.

నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిన తరువాత పత్రికల్లో మీడియా ఛానళ్లలో ప్రసారమైన కథనాలు ఒకటే. నయీమ్ కు వివిధ రాజకీయ సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయంటూ కథనాలు ప్రసారమైన విషయం తెలిసిందే. టిఆర్ ఎస్ నేతలలోనే ఎక్కువమందికి నయీమ్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది. నయీమ్ కేసులో విచారణకు పోలీస్ లు అరెస్ట్ చేసిన వారిలో కింది స్థాయి టిఆర్ ఎస్ నేతలు కూడా ఉన్నారు.కానీ ఆ వార్తలని అవాస్తవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ప్లేట్ పిరాయించింది.టిఆర్ ఎస్ పార్టీ కి చెందిన నేతలని నయీమ్ వివాదం నుంచి తప్పించడానికే కేసీఆర్ ఇలా చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.టిఆర్ ఎస్ నేతలు నయీమ్ కేసులో ఇరుక్కోకుండా కేసీఆర్ నయీమ్ కేసుని తారుమారు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments