కేటీఆర్ రాహుల్ గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..!

Sunday, October 7th, 2018, 12:01:41 AM IST

తెలంగాణా లోని ముందస్తు ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి,దానితో ఎంతో సమయం లేదు.ఇక ఒక్కక్క పార్టీ వారు వారి వ్యూహాలతో దూసుకెళ్ళిపోతున్నారు.ఒకరి మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.ఈ తీవ్రత ఐతే తెరాస మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యలో తార స్థాయిలో ఉందని చెప్పాలి.కెసిఆర్ తన సభల్లో సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ వారిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.నిన్నటి కెసిఆర్ మాటలపై రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడి కెసిఆర్ కుటుంబం వారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని,ఇలాంటి చర్యలు తగవని హెచ్చరించారు.

ఇప్పుడు ఈ మాటలకు గాను,తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కుట్ర కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబంకి ప్రజలకి మధ్య పోటీ జరుగుతున్న మాటలు నేను ఒప్పుకుంటున్నాని కేటీఆర్ తెలిపారు.ఖచ్చితంగా ఇది ఒక కుటుంబానికి ప్రజలకి మధ్య జరుగుతున్న పోటీయే అని కానీ అది రాహుల్ గాంధీ కుటుంబానికి,తెలంగాణా ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని,ఏ రాహుల్ గాంధీ కుటుంబానికి చెందిన వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ 1968లో అన్యాయంగా 369 మంది తెలంగాణా వాళ్ళని పొట్టన పెట్టుకుందో ఆ రాహుల్ గాంధీకి తెలంగాణా ప్రజలకు పోటీ ఏర్పడుతుంది అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.