షాకింగ్‌: ఏపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ నేత పోటీ!

Sunday, February 10th, 2019, 10:09:29 AM IST

ఏపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ నేత పోటీకి దిగుతున్నాడు. అత‌నికి జ‌న‌సేన మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. 2014లో ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం నుంచి పోటీ చేసిన సీపీఎం నేత సున్నం రాజ‌య్య త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌బోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఖ‌మ్యం నుంచి పోటీకి దిగ‌డానికి నిరాక‌రించిన ఆయ‌న ఏపీ ఎన్నిక‌ల్లో మాత్రం నిల‌బ‌డ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న ఏపీలోని రంప‌చోడ‌వ‌రం నుంచి బ‌రిలోకి దిగుతున్నారు. గ‌త కొంత కాలంగా వామ ప‌క్షాల‌తో సానుకూలంగా వుంటున్న జ‌న‌సేన పార్టీ సున్నం రాజ‌య్య‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంది.

2014 ఎన్నిక‌ల‌కు ముందు పోల‌వ‌రం ముంపు గ్రామాల్ని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీలో విలీనం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సున్నం రాజ‌య్య ఏపీకి వెళ్లిపోయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, ఇదే సున్నం రాజ‌య్య‌ను రంప‌చోడ‌వ‌రంలో పోటీకి దిగేలా చేసింద‌ని చెతున్నారు. వామ ప‌క్షాల‌తో పొత్తు కార‌ణంగా గోదావ‌రి జిల్లాల్లో రెండు స్థానాల్ని సీపీఎంకి వ‌ద‌లాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇప్ప‌టికే సున్నం రాజ‌య్య‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన అధినేత ఇప్ప‌టికే పార్టీ క్యాడ‌ర్‌కు సూచించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏపీలో తెలంగాణ నాయ‌కుడు పోటీ చేయ‌డం అన్న‌ది ఓ ట్రెండ్ అనే చెప్పాలి. ఇక ఏపీ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఇప్ప‌టికే షాడో అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రోక్షంగా జ‌గ‌న్ – ప‌వ‌న్ జోడీకి మ‌ద్ధ‌తు ప‌లికేందుకు స్కెచ్ గీసిన సంగ‌తి తెలిసిందే.