అమెరికాలో ప్రమాదం నుంచి తప్పించుకున్న తెలుగోడు

Wednesday, March 7th, 2018, 08:00:59 PM IST

అమెరికాలో చాలా రోజుల తరువాత ఓ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న ఓ కుటుంబానికి ఒక్క క్షణం భయాన్ని రేపింది. కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన భాను ప్రకాష్ ఉన్నత విద్య కోసం కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అట్లాంటా జార్జియా నగరంలోనే చదువుకుంటూ.. ఓ షాప్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే భాను షాప్ లో ఉండగా ఒక దుండగుడు అక్కడికి వచ్చి అతన్ని బెదిరించాడు. పిస్టల్ ను గురిపెట్టి కదిలితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత సెల్ ఫోన్ ను అలాగే షాప్ లో ఉన్న డబ్బును తీసుకొని పారిపోయాడు. ఘటన మొత్తం షాప్ లో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. భాను ప్రకాష్ కి గండం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని కనిపెట్టే పనిలో పడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments