మోడీకి 9 పైసల చెక్ పంపిన వ్యక్తి!

Tuesday, June 5th, 2018, 03:05:24 AM IST

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. పెట్రోలు ధరలు పెరిగాయి అనే వార్త వినే లోపే మరో రూపాయి పెంచేస్తుండడం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మధ్య తరగతి వ్యక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటి పెరుగుదల వల్ల ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలానే పెరుగుతున్నాయి. రూపాయల్లో ధరలు పెంచేసి అదిగో తగ్గించేస్తున్నాం అని పైసల్లో తగ్గించడం అలవాటుగా మారింది. కేంద్రం తీరుకు నిరసనగా ఒక తెలంగాణ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీకి చెక్ పంపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చందు గౌడ్ వ్యక్తి ప్రధాని మోడీకి 9 పైసలు పంపించాడు. అది చెక్ రూపంలో అందజేయాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కు అందించాడు. ప్రధాని రిలీఫ్ ఫండ్ కు 9 పైసల చెక్ అందిస్తున్నట్లు చందు గౌడ్ తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments