‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’

Sunday, September 9th, 2018, 12:12:50 PM IST

సాధారణంగా ఎలక్షన్స్ కి ఒక ఏడాది సమయం ఉంది అనగానే నాయకులూ ఒక్కసారిగా ప్రజలను ఆకర్షించే పని పెట్టుకుంటారు. ఇక ఎన్నికల సమయాం దగ్గరపడుతున్న కొద్దీ ఓట్ల కోసం విధుల్లో నడుస్తూ ప్రచారాలను నిర్వహిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి మీ ఓటు మా పార్టీ గుర్తుకే వెయ్యాలి అంటూ బ్రతిమాలుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణాలో కూడా అలాంటి సన్నివేశాలు కనిపించే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే.

అయితే ఒక తెలంగాణ వ్యక్తి ప్రచారాల పరిస్థితిని ముందే ఉహించి తన ఇంటికి ఎవరు రావద్దని, ఈ ఇంటి ఓట్లు అమ్ముడుపోనని తన ఇంటి గోడపై పెద్ద అక్షరాలతో రాశారు. అదే విధంగా అంబేద్కర్ సూక్తి కూడా ఉంది. “నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు- ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. ఓడిపోయి(అమ్ముడుపోయి) బానిసలవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది’ అంటూ పేర్కొన్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనగామ జిల్లా కోమళ్లకు చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి తన ఇంటి గోడపై ఈ విధంగా రాసుకున్నాడు.

ఓటర్లే దేవుళ్లు అనే విధంగా నాయకులూ మాట్లాడే మాయ మాటలకూ డబ్బుకు, మద్యానికి ఆశపడి చాలా మంది ఓట్లు వేస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు ఈ ధోరణి తగ్గడం లేదు. ఐదేళ్ల పాలనలో గెలిచినా తరువాత కనిపించని నాయకుడు ఎన్నికలు వస్తున్నాయి అనగానే ఇంటిముందు నమస్కరిస్తూ నిలబడతాడు. అలాంటి వారికి వెంకటస్వామి మంచి కౌంటర్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రజలకు కూడా ఇదొక మంచి సందేశమని చెప్పాలి. మరి ఇది చూసిన తరువాత కుడా నేతలు అతని ఇంటికి వెళతారా?

  •  
  •  
  •  
  •  

Comments