దిల్లీలో తెలంగాణ ఓట‌ర్లు ఫైన‌ల్‌?

Tuesday, October 9th, 2018, 12:01:26 AM IST

ఈ మంగ‌ళ‌వారం ఉద‌యం కేంద్ర ఎన్నికల సంఘం జరిపే సమీక్షలో తెలంగాణ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌ రజత్ కుమార్ పాల్గొన‌నున్నారు. ఓటర్ లిస్ట్ పై తుది నివేదికను ఫైన‌ల్ చేయ‌నున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లిస్ట్‌ని ఫైన‌ల్ చేసి ఇదే ఫైన‌ల్ అని ఆమోద ముద్ర వేయ‌నుందిట‌. దీంతో పాటే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాగ్రర్థాలు తీసుకున్నారు? ఎంత మంది సిబ్బంది కావాలి? శాంతిభద్రతలకు ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది? సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నున్నాయి? వ‌ంటి సమగ్ర వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుంచేందుకు పెద్ద జాబితాను సిద్ధం చేసి తీసుకెళ్లార‌ట ర‌జ‌త్.

ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ ర‌జ‌త్ కుమార్‌కి నిదుర ప‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఎందుకంటే ఈసారి ఎన్నిక‌లు తెలంగాణ‌లో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం. ఎట్టి ప‌రిస్థితిలో కేసీఆర్‌ని గ‌ద్దె దించ‌డ‌మే ధ్యేయంగా ప్ర‌త్య‌ర్థులు పావులు క‌దుపుతుంటే, కుర్చీని ఎవ‌రికీ ద‌క్క‌కుండా తానే ఉండేలా కేసీఆర్ ప్ర‌తిదాడుల‌కు పాల్ప‌డ‌నున్నారు. డ‌బ్బు, మ‌ద్యం పారించే ఎత్తుగ‌డ‌ల్లోనూ ఎవ‌రికి వారు బిజీ. బీరు పొంగించే బారుల్ని పొలాలు, ఇంటి గోడ‌ల్లో దాచేస్తున్నార‌ట అప్పుడే. ఇక డ‌బ్బు సంచుల్ని కూర‌డం మొద‌లు పెట్టేశార‌ట‌. ధ‌న‌రాజ‌కీయం అంతే క్రేజీగా సాగ‌నుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అందుకే ర‌జత్‌కి, ఎన్నిక‌ల సంఘాల‌కు ఈసారి ఎల‌క్ష‌న్ పెను స‌వాల్ లాంటిదే.