తెలంగాణ బిగ్ ఫైట్.. అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ ‌పైనే..!

Friday, December 7th, 2018, 05:58:03 PM IST

తెలంగాణ మ‌హాసంగ్రామం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. తెలంగాణ‌తో పాటు ఈరోజే రాజస్థాన్‌లోనూ పోలింగ్ ముగిసింది. దీంతో తాజాగా ఈ రెండు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈరోజే విడుదలవుతున్నాయి. దీంతో అంద‌రి దృష్టి ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై ప‌డింది.

ఇక ఎన్నిక‌ల నేప‌ధ్యంలో జాతీయ వార్తా చానెళ్లు ఎన్డీటీవీ, టౌమ్స్ నౌ, ఏబీపీ, హెడ్‌లైన్ టుడే, సీఎన్ఎన్ ఐబీఎన్, న్యూస్ 24లు వివిధ సర్వే సంస్థలతో కలిసి ఫలితాలను ప్రసారం చేశాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన టీంతో సర్వే చేయించి పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నారు. అలాగే ఈసారి కూడా తెలంగాణ ఎన్నికలపై అన్ని సంస్థలతో పాటు ల‌డ‌డ‌పాటి కూడా ఎగ్జిట్ పోల్స్‌ను వెలువర్చనున్నాడు. అయితే పోలింగ్‌కు ముందు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయోద్దని, ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో.. ఓటంగ్ ముగిసిన తర్వాతే తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించడానికి అన్ని సంస్థలు సిద్ధమయ్యాయి. దీంతో మ‌రికొద్ది సేప‌ట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ‌డంతో రాజకీయ‌వ‌ర్గాల్లో ఎలాంటి ప్ర‌కంప‌నలు సృష్టిస్తాయో చూడాలి.