తెలంగాణ‌కు తెరాస అవ‌స‌రం ఎంత‌?

Saturday, October 20th, 2018, 11:01:43 AM IST

తెలంగాణ‌కు తెరాస అవ‌స‌రం ఎంత? ప‌్ర‌స్తుతం తెలంగాణ స‌మాజంలో జ‌రుగుతున్న చ‌ర్చిఇది. 14 ఏళ్ల ఉద్య‌మ ప్ర‌స్థానం… తెలంగాణ తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి చ‌రిత్ర‌లో నిలిచిన పార్టీ కావ‌డం… నాలుగేళ్ల పాల‌న‌…పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తెరాస‌ను ప‌క్క‌న పెట్టి మ‌రో పార్టీకి ప‌ట్టం క‌డితే ఆ త‌రువాత ఎదుర‌య్యే ప‌ర్య‌వ‌సానాలేంటీ? ఎంతో మంది ప్రాణ త్యాగాల‌తో ఉద్భ‌వించిన తెలంగాణ విఫ‌ల ప్ర‌య‌త్నం అవుతుందా? … తెరాస‌ను ప‌క్క‌న పెడితే రాబోయే పార్టీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ను మ‌ళ్లీ పాత ముళ్ల బాట‌ను ప‌ట్టించ‌ద‌న్న న‌మ్మ‌క‌మేంటి?…ఇలాంటి కోటి ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం తెలంగాణ స‌మాజాన్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి.

తెలంగాణ తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్య‌మ పార్టీగా తెరాస చేసింది ఆశించిన‌స్థాయిలో లేకపోయినా… తెరాస ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానాల వ‌ల్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వున్నా….ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తెరాస త‌ప్ప తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేద‌ని గ్రామ స్థాయి స‌ర్వేల్లో బ‌య‌ట‌ప‌డుతోంది. తెరాస‌ను మ‌ళ్లీ అధికారాన్ని క‌ట్ట‌బెట్టాల‌నే ఆలోచ‌న లేకున్న మ‌రో ఆప్ష‌న్ క‌నిపించ‌క‌ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే తెరాస‌కు ఓటేయాల‌ని, మ‌ళ్లీ అదే ప్ర‌భుత్వాన్ని తెలంగాణ‌లో నిల‌బెట్టాల‌ని కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ఇది ఎవ‌రు కాద‌న్నా…అవున్నన్నా క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్న నిజ‌మిది.

కేసీఆర్ అందుకే ధీమాగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌హాకూట‌మి అంటూ టీడీపీ, తెజ‌స‌, సీపీఐతో క‌లిసి జ‌ట్టుక‌ట్టిన కాంగ్రెస్‌ని న‌మ్మే స్థాయిలో తెలంగాణ ప్ర‌జానీకం లేక‌పోవ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. తెలంగాణ‌ను తెచ్చింది మేమే.. ఇచ్చింది మేమే అని గొంతుచించుకుని అరుస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు ఉద్య‌మ స‌మ‌యంలో మాత్రం ఆ స్థాయి ధీర‌త్వాన్ని చూపించ‌లేక రేస్‌లో బ్యాక్ బెంచీలో నిలుచుని వేడుక చూసిన విధానం..2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖమ్మంలో నిర్వ‌హించిన‌ ప్ర‌చారంలో అప్ప‌టి మాజీ కాంగ్రెస్ ఎంపీ బ‌ల‌రామ్ నాయ‌క్ కాంగ్రెస్‌ను గెలిపించ‌క‌పోతే తెలంగాణ‌ను మళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తామ‌ని బెదిరించిన మాట‌లు ఇంకా తెలంగాణ ప్ర‌జ‌ల్లో వినిపిస్తూనే వున్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి మ‌హాకూట‌మికి సార‌థ్యం వ‌హిస్తున్న‌ కాంగ్రెస్ ప‌ట్టం క‌డ‌తార‌నేది ఎంత‌వ‌ర‌కూ న‌మ్మొచ్చు? మ‌రోవైపు తేరాస‌లో ప‌ని చేయ‌ని నాయ‌కుల్ని ప్ర‌జ‌లే త‌న్ని త‌రిమేస్తున్నారు. ఓట్లు అడ‌గడానికి వ‌చ్చి చీవాట్లు తింటున్న నాయ‌కులు ఉన్నారు. ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ముంద‌స్తు ఫలితం 50- 50 ఛాయిస్ అన్న చందంగానూ క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments