తెలంగాణా సర్వే.. మళ్ళీ ఆయనే సీఎం!

Saturday, September 15th, 2018, 01:35:45 PM IST

మరో 8 నెలల సమయం ఉన్నప్పటికీ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమైన కేసీఆర్ పై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చాలా మంది ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేతలు కామెంట్ చేశారు. అయితే ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని స్పష్టం చేశారు.

వార్తా చానల్‌ ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియాతోజరిపిన సర్వే ప్రతిపక్షాలకు షాకిచ్చిందనే చెప్పాలి. పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తంగా 7,110 మంది పాల్గొనగా అందులో
43 శాతం మంది కేసీఆర్ కు మద్దతుగా ఓటేశారు. ఇక సెకండ్ ప్లేస్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిలిచారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కేవలం 18 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఇకపోతే కేసీఆర్ ప్రధాని కావాలని 11 శాతం మంది కోరుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments