ఈ డిసెంబర్ లోనే తెలంగాణా ఎన్నికలు మరియు లెక్కింపు.!

Sunday, October 7th, 2018, 04:00:18 AM IST

తెలంగాణలోని ముందస్తు ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ పార్టీలలో వేడి పుట్టుకొచ్చింది.తాము ఎప్పుడైనా సరే ఎన్నికలకు సిద్ధం అంటూ ఎన్ని కూటములు వచ్చినా గెలుపు మాదే అంటూ కెసిఆర్ ముందస్తుకు వెళ్లారు.ఇప్పుడు వచ్చిన తాజా వార్త ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం వారు ప్రకటించారు.తెలంగాణా,మధ్యప్రదేశ్,రాజస్థాన్ మరియు మిజోరాంలలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ సంవత్సరం నవంబర్ 12 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని,అంతే కాకుండా అదే నెల 19 వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ కు తుది గడవని ప్రకటించారు.నవంబర్ 22వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవచ్చని ప్రకటించారు.ఇక ఆ తరువాత నెల డిసెంబర్ 7 వ తారీఖున తెలంగాణలోని ఎన్నికలు ఉంటాయని మళ్ళీ ఆ నాలుగు రోజుల వ్యవధిలోనే డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఎన్నికల సంఘం వారు ఖరారు చేసేసారు.అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా ఒకే దశలో ఎన్నికలు ఉంటాయని,ఓట్ల లెక్కింపు అయినా మరునాడే తెలంగాణా రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు అనేది కూడా తొందరగానే తేలుస్తారని తెలుస్తుంది.