సర్పంచ్ ల పదవీకాలం రేపటితో ఫినిష్!

Tuesday, July 31st, 2018, 08:27:37 AM IST

తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ల పదవీకాలం బుధవారం ముగియనుంది (ఆగస్టు 1). ఎలక్షన్ జరగకముందే ఈ సారి గ్రామాధినేతల పదవీకాలం ముగియడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సర్పంచ్ ల పదవీకాలం ముగియనుందన్న కొన్ని రోజులకి ముందే ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ సుప్రీం కోర్టులో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉండడంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పద్దతిలో అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి పెరిగాయంటూ కోర్టు ఆరా తీయడంతో ఒక్కసారిగా ఎలక్షన్స్ కు బ్రేక్ పడింది. దీంతో బీసీ ఘనన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ పనులు పూర్తవ్వాలి అంటే కనీసం ఐదు లేక ఆరు నెలల సమయం పట్టె అవకాశం ఉంది. దీంతో గ్రామ సర్పంచ్ ల స్థానంలో ప్రభుత్వ అధికారులను నియమించనున్నారు. మొన్నటి వరకు కొన్ని గ్రామాల్లో సర్పంచ్ ల హడావుడి బాగానే మొదలైంది. ఎలక్షన్ వస్తున్నాయని రూమర్స్ బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మినిమామ్ 5 నెలల సమయం పడుతుంది అని తెలియడంతో ప్రచారాలని వాయిదా వేసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments