చంద్రబాబుకు తెలంగాణ విద్యార్థుల పాలాభిషేకం..!

Friday, December 8th, 2017, 11:30:04 PM IST

తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో దాదాపుగా కనుమరుగైపోతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు విద్యార్థులు పాలాభిషేకం చేసేంతగా టీడీపీ గొప్పపని ఏం చేసిందనే సందేహాలు రావొచ్చు.వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ పై విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తే దీనికి కారణం. డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ విద్యార్థులు చాలా నిరాశలో ఉన్నారు. విభజన తరువాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రెండవ సారి డిఎస్సి నోటిఫికేషన్ ని జారీ చేసింది.

కానీ తెలంగాణలో మాత్రం నోటిఫికేషన్ జాడ లేకపోవడంతో స్టూడెంట్స్, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. కేసీఆర్ వైఖరిని నిరసించిన తెలంగాణ విద్యార్థులు మహబూబ్ నగర్ లో చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి విన్నూత్నంగా నిరసన తెలియజేసారు. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు.

  •  
  •  
  •  
  •  

Comments