ఆంధ్ర చరిత్రపై వేటు

Friday, September 12th, 2014, 08:34:58 AM IST

books
తెలంగాణ రాష్ట్రం విద్యార్ధుల పాఠ్య పుస్తకాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చరిత్ర గాని మరి ఏ ఇతర అంశంగాని ఉన్నట్లైతే వాటినివెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే కేవలం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి చెందిన అంశాలను పుస్తకాలలో పొందుపరచాలని ప్రభుత్వం పేర్కొంది.కాగా కొన్ని చోట్ల రెఫెరెన్స్ వరకు ఆంద్ర ప్రసక్తి ఉన్నప్పటికీ అంతకన్నా అధికంగా ఏపీ చరిత్ర ఉండరాదని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇక దీనిపై స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఎస్ జగన్నాధ్ రెడ్డి మాట్లాడుతూ పాఠ్యాంశంలో ఏదేని ఆంధ్రప్రాంతానికి చెందిన కవికి సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే దానిని తొలగించి ఆ స్థానంలో తెలంగాణకు చెందిన కవితలు గాని, కవుల వివరాలు గాని పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిపారు. కాగా విద్యార్ధుల పాఠ్యాంశాలలో ఏది ఉంచాలో ఏది తీసివేయ్యాలో అనే అంశంపై త్వరలో ఒక వర్క్ షాప్ ను ఏర్పాటు చేసి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జగన్నాధ్ రెడ్డి పేర్కొన్నారు.