తెలంగాణ కోసం 19 కోట్ల మొక్కు

Sunday, January 29th, 2017, 03:00:26 AM IST

kcr
తెలంగాణ కోసం పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మొత్తానికి తాను అనుకున్నది సాధించారు కెసిఆర్. 2014లో ఆయన కల నిజమైంది. ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్న తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాలేదు. 2001లో కెసిఆర్ టీడీపీ నుండి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినపుడు చాలామంది చులకనగా మాట్లాడారు. కెసిఆర్ వల్ల ఏం ఒరుగుతుంది అనుకున్నారు.

కానీ ఆయన ఎవరేం అన్నా పట్టించుకోకుండా తాను చేరాల్సిన లక్ష్యం వైపు దూసుకుపోయారు. మధ్యలో ఎన్నో అవాంతరాలు ఆయనకు అడ్డుగా నిలిచాయి. అయినా భయపడకుండా ఆయన ముందుకే వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక తెలంగాణ రావాలని చాలామంది దేవుళ్ళకు మొక్కులు మొక్కారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఆ దేవుళ్లందరికీ మొక్కులు చెల్లిస్తున్నారు. 2010లో తిరుమల శ్రీవారికి కెసిఆర్ తెలంగాణ కోసం మొక్కుకున్నారు. దానికోసం ఇప్పుడు 5.59 కోట్ల రూపాయలతో శ్రీవారికి సాలగ్రామహారం, పెటాల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూర్ లో 19 కేజీల బంగారంతో చేయించారు.