హాలీవుడ్ హీరోగా మారిన తాడేపల్లి గూడెం కుర్రాడు..!

Monday, February 13th, 2017, 05:23:21 PM IST


తెలుగు కుర్రాడు రోని హాలీవుడ్ లో అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘గ్రోయింగ్ అప్ స్మిత్ ‘చిత్రం కోసం 1000 మందిని ఆడిషన్స్ చేయగా రోని కి మాత్రమే అవకాశం లభించింది. ఈ యువకుడు ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెం కు చెందిన వాడు. ఈ చిత్రం లో స్మిత్ భట్నాగర్ అనే పాత్రలో నటించనున్నాడు. రోని ప్రతిభని షికాగో లోని డైలీ హెరాల్డ్ ప్రశంసిస్తోంది.

ఇది తన మొదటి చిత్రమని, జేసన్ లీ, హిల్లరీ హిల్లరీ బర్దన్ వంటి నటులతో కల్సి నటించడం తన అదృష్టమని అంటున్నాడు. గతం లో తాను కొన్ని టివి షోలలో కూడా నటించానని అన్నాడు. ఈ చిత్రంలో తాను 1970 నటి కుర్రాడిపాత్రలో కనిపిస్తానని అంటున్నాడు. తెలుగులో తనకు అల్లుఅర్జున్ అంటే ఇష్టమని, అతడి డాన్సులు తనకు ఇష్టమని అన్నాడు.