ముఖ్యమంత్రుల మూఢనమ్మకాలు ప్రజల పాలిట శాపాలు !!

Thursday, December 1st, 2016, 03:44:19 AM IST

kcr-babu
దేశంలో పేరుగాంచిన రాజకీయనాయకులందరికి ప్రత్యేక మైన శైలి ఉంటుంది. పరిపాలనలో వారు అవలంభించే విధానాల లో ఎవరి శైలి వారిది. ఇప్పటివరకు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రులుగా చేసిన నాయకులు కూడా ప్రత్యేక మైన పరిపాలన పద్దతులను అవలంభించేవారు.కానీ ఇప్పటివరకు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రులుగా చేసిన మన నాయకులందరికీ ఓ పోలిక ఉంది. దానిని పోలిక అనడం కంటే అంటురోగం అనడం సరిగ్గా ఉంటుందేమో. స్వర్గీయ ఎన్టీఆర్, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యాధి ఇంకా కొనసాగుతూనే ఉంది. అనవసరంగా క్యాంపు ఆఫీస్ లు, లగ్జరీ ఇళ్లకోసం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుచేయడమే వీరికి సోకినా వ్యాధి. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ 50 కోట్లు ఖర్చు చేసి 150 గదులు, 3 హాల్స్ , బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లతో అధికారిక ఇంటిని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ అంశమే పెద్ద చర్చకు దారి తీస్తోంది. మన ముఖ్యమంత్రులందరికీ ఈ వ్యాధి ఉందంటూ చర్చ సాగుతోంది.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో బేగంపేట లో క్యాంపు ఆఫీస్ ని నిర్మించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దానిని మరో రెండు ఎకరాల విస్తీరణం పెంచి దాదాపు రూ 10 కోట్ల వ్యయంతో కొత్త హంగులను చేర్చారు. కానీ ఆ నిర్మాణం పూర్తయ్యెసరికి వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రోశయ్య కూడా దానిలో అనేక మార్పులు చేపట్టారు. అయాన కొద్దీ రోజులకే పదవి నుంచి దిగిపోవడంతో ముఖ్యమంత్రి పదవి కిరణ్ కుమార్ రెడ్డి ని వరించింది. అయన కూడా అనేక మార్పులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కాలనీ లోని తన వ్యక్తి గత నివాసానికి కూడా ప్రభుత్వ ధనంతో మార్పులు చేయించుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ అధికారంలోకి వచ్చి దానిని పూర్తిగా మార్చేసి రూ 50 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన భవనాన్నికట్టించుకున్నారు. దీనిపై విపక్షాలు గగ్గోలు పెట్టినా.. టిఆర్ ఎస్ వర్గాలు మాత్రం సమర్థించుకుంటున్నాయి. కేసీఆర్ అంత డబ్బు ఖర్చు చేసిని క్యాంపు ఆఫీస్ కే అని వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాదని అంటున్నారు. కేసీఆర్ కు అంటువ్యాధి రూపం లో మరో జబ్బుకూడా చేసిందనే వాదన వినిపిస్తోంది. అదే వాస్తు పిచ్చి. గతం లో మనకు వాస్తు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రులు చాలా మందే ఉన్నారు. గతం లో తిరుగులేని నేతలుగా ఉన్న పివి నరసింహారావు, ఎన్టిఆర్, మర్రిచెన్నారెడ్డి వంటి నేతలకు ఈ పిచ్చి బాగానే ఉండేది. వారిహాయం లో వాస్తు శాస్త్రం లో ప్రావీణ్యం పొందిన వారు ముఖ్యమైన రాజకీయ పదవులను పొందారు.

రామారావు హయంలో వాస్తు శాస్త్రంలో పండితుడిగా చెప్పబడే బివి మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే సీటు ఇచ్చి అతనికి మంత్రి పదవి కూడా కట్ట బెట్టారు. అతని వద్ద నుంచి వాస్తు పరమైన సలహాలు ఎన్టీఆర్ ఎప్పుడు పొందేవాడు. మర్రి చెన్నా రెడ్డి హయంలో వాస్తు శాస్త్రంలో పండితుడైన బిఎన్ రెడ్డి కి రాజ్య సభ సీటు ఇచ్చారు. కేసీఆర్ కు కూడా ఆ అలవాటు పాకింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటినుంచి ప్రతి సందర్భంలో చినజీయర్ స్వామి సలహాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కలర్ పరంగా వాస్తు బాగా లేదని కేసీఆర్ తన కాన్వాయ్ ని ఈ రెండేళ్లలో రెండు సార్లు మార్చడం విశేషం. కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగించిన టాటా సఫారీ కాన్వాయ్ ని ఉపయోగించారు. కొద్ది రోజులకే ప్రభుత్వం రూ 6 కోట్లు ఖర్చు చేసి బులెట్ ప్రూఫ్ బ్లాక్ స్కార్పియో ని కొనుగోలు చేసింది. వాస్తుపరంగా కలర్ బాగోలేదని మరలా వైట్ కలర్ స్కార్పియో ని కొన్నారు.

ఇలా పదవి చేపట్టిన ప్రతి ముఖ్యమంత్రి ప్రజా ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇక వారి పర్యటనలకు అయ్యో ఖర్చు అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలకే రూ 100 కోట్లని ఖర్చు చేశారన్న వార్తలు వస్తున్నాయి. విజయవాడలోని క్యాంపు ఆఫీస్ కు రూ 40 కోట్లు ఖర్చు చేశారన్న వాదన కూడా ఉంది.వీరి అనవసర ఖర్చుల చిట్టా ని విప్పితే చాంతాడు అంత అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.వీరి ఖర్చులను అదుపులో ఉంచుకుంటే ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాన్ని ప్రవేశ పెట్టొచ్చన్నది విశ్లేషకుల వాదన.