తెలుగు తమ్ముళ్ల చిత్త శుద్ధి ఇదేనా..?

Monday, February 11th, 2019, 04:35:42 PM IST

ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు అలాగే రాష్ట్రానికి ఎంతో కీలకమైనటువంటి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు బీజేపీ తో విభేదించి బయటకు వచ్చారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మాటలు మార్చి ఇప్పుడు ఎక్కడ ప్రత్యేకహోదా పై కానీ పోరాడకపోతే తెలుగుదేశం పార్టీపై మరింత వ్యతిరేఖత వస్తుందేమో అని వారు ఇక అప్పటి నుంచి కేంద్రానికి వ్యతిరేఖంగా పోరాటాలు చెయ్యడం మొదలు పెట్టారు.అయితే అందులో భాగం గానే ఈ రోజు కూడా హోదా కావాల్సిందే అని ఢిల్లీ వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేసారు.

అయితే వీరు నిజంగానే ఆంధ్ర రాష్ట్రం పట్ల అలాగే రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకమైన ప్రత్యేక హోదా అంశం పట్ల అంత చిత్త శుద్దితో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారా అంటే లేదనే చెప్పాలి.కేవలం స్టేజి పైన మాటల్లో తప్ప వీరికి హోదా అంటే ఇంకెక్కడా పట్టనట్టే ఉంటున్నారని సామాన్య ప్రజానీకం తెలుగుతమ్ముళ్లను ప్రశ్నిస్తున్నారు.ఈ ఈ రోజు అక్కడికి వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ కీలక నేతలంతా ఒక ఫొటో తీసుకున్నారు,ఆ ఫోటోలో చూస్తే అక్కడ ఉన్న ఏ ఒక్క తెలుగుదేశం నాయకుని మోహంలో కూడా హోదా కోసం చింత ఎక్కడా కనిపించట్లేదు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఆవేదన,ఆగ్రహాలతో కనిపించాల్సిన వీరు ఇలా నవ్వుకుంటూ ఏదో విహారయాత్రకు వెళ్లినట్టు వెళ్లారని సోషల్ మీడియాలో సాధారణ జనం మండిపడుతున్నారు.