సిఎం సహాయనిధికి తెలుగు సినిపరిశ్రమ విరాళం

Tuesday, October 14th, 2014, 04:25:34 PM IST

alll-heros
హుధూద్ తుఫాను భీభత్సానికి ఉత్తరాంధ్రా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రతిఒక్కరు చేయి చేయి కలిపి ఉత్తరాంధ్రా జిల్లాలను ఆడుకోవలసిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా అందమైన నగరం వైజాగ్ తుఫాన్ ధాటికి శిధిలం అయింది. విపత్తులు సంభవించినప్పుడు అందరికంటే ముందుగా సినిపరిశ్రమ స్పందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమవంతు విరాళాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రముఖ టాలివుడ్ హీరోలు తమ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటించారు. హీరోలు ప్రకటించిన విరాళాలు ఈ విధంగా ఉన్నాయి.

* జనసేన అధ్యక్షుడు సినినటుడు పవన్ కళ్యాణ్ 50లక్షలు
* ప్రిన్స్ మహేష్ బాబు 25లక్షలు
* జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు
* అల్లు అర్జున్ 20 లక్షలు
* రామ్ చరణ్ 10 లక్షలు