అమెరికాలో మన తెలుగు విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి

Friday, January 20th, 2017, 02:17:03 PM IST

girl
దూరపు కొండలు నునుపు అనే సామెత మన భారతీయులకు సరిపోతుంది. అందులోను మన తెలుగు ప్రజలకైతే అతికినట్టు సరిపోతుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి కొన్ని లక్షల మంది అమెరికాలో చదువులు, ఉద్యోగాల పేరుతొ అమెరికా వెళ్తున్నారు. ఇలా వెళ్లే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇక్కడ వాళ్ళ తల్లితండ్రులు మాత్రం తమ పిల్లలు అమెరికాలో ఉన్నారని అందరితో చెప్పుకుని మురిసిపోతారు. కానీ అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుపుతూ ఒక తెలుగు అమ్మాయి వీడియో చేసి ఆన్ లైన్ లో పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఆ అమ్మాయి ఏం చెప్పిందో చూస్తే మన విదేశీ కలలను పక్కన పెట్టి హ్యాపీ గా ఇండియాలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడం నయం అనిపిస్తుంది. ఆ అమ్మాయి అక్కడ భారతీయులు పడుతున్న ఇబ్బందిని నవ్వుతూనే చెప్పినా ఆ అమ్మాయి మాటలలో అక్కడ మనవాళ్ళు పడుతున్న బాధలు అందరికీ తెలిసేలా చేసింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.