పవన్ పై మరో కుట్రకు రంగం సిద్ధమయ్యిందా..?

Thursday, May 16th, 2019, 02:03:22 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే రెండు పార్టీలు మాత్రమే ఉండాలి మూడో ప్రత్నామ్యాయం వస్తే మాత్రం మిగిలిన వారు అంతా కలిసి ఆ మూడో వ్యాకతిని ఎలా అయినా సరే తొక్కేయ్యడానికి ప్రయత్నిస్తారన్న సంగతి యావత్తు ఏపీ ప్రజలందరికీ తెలిసిందే.గతంలో “ప్రజారాజ్యం” అనే పార్టీ పెట్టినపుడు సినిమాల నుంచి వచ్చిన చిరుపై ఎన్ని కుట్రలు జరిగాయో అందరికీ తెలిసినదే.ఇక ఆ తర్వాత మళ్ళీ “జనసేన” అనే పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత అతనిపై కూడా చిరు తరహా కుట్రలు జరిగాయి కానీ సోషల్ మీడియా ప్రభావం మరియు జనసేన అభిమానుల వల్ల అవి పవన్ ఇమేజ్ ను కూసింత కూడా తగ్గించలేకపోయాయి.

పవన్ ను డీఫేమ్ చేసే ప్రక్రియలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ హస్తం ప్రధానమైనదని కూడా అందరికీ తెలిసిందే.ఈ మధ్య కాలంలో ఆ ఛానెల్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా అందరు చూసారు.కానీ తాజాగా నిన్న మొదటిసారిగా పవన్ పేరును కూడా ప్రస్తావించని వారు ఏకంగా అతన్ని కింగ్ మేకర్ ను చేసేసారు.దీనితో ఈ విషయం పవన్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.కానీ మరికొంత మాత్రం ఇవన్నీ నమ్మడానికి లేదు అని ముందు పవన్ పేరును వారి స్వప్రయోజనాలకు వాడుకొని చివరిలో విషం కక్కుతారని ఇదంతా చూస్తుంటే పవన్ పై మరో కుట్ర ఏదో జరుగుతున్న అనుమానాలు కలుగుతున్నాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.