ఆ జీతం వల్ల జీవితాన్ని ముగించుకున్న యువకుడు

Friday, February 9th, 2018, 12:20:34 PM IST

విదేశాలకు వెళ్లిన కొడుకు ఎలా ఉన్నాడో అనే ఆలోచన ప్రతి తల్లి దండ్రులకు ప్రతి రోజు గుర్తుకు రాకుండా ఉండదు. సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు చాలా మంది ఉంటారుల. కానీ ఊహించని విధంగా కొడుకు అక్కడే తుది శ్వాసను విడిచాడు అంటే వారి కడుపుకోతను ఎవరు తీర్చలేనిది. రీసెంట్ గా అదే తరహాలో ఓక విషాద ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ కి వెళ్లిన కుమారుడు తీరిగిరాని లోకాలకు వెళ్లడం అందరిని షాక్ గురి చేసింది. చనిపోయే ముందు ఆ యువకుడు పంపిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

నా తల్లికి డబ్బులు పంపలేకపోతున్నా. నాన్నను, అమ్మని, తమ్ముణ్ణి బాగా చూసుకోండి’ అంటూ తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపి తోట నాగరాజు (24) అనే యువకుడు గల్ఫ్‌లోని దోహా ఖతార్‌ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే… బాదంపల్లి జిల్లా మంచిర్యాల గ్రామంకి చెందిన నాగరాజు గత ఐదేళ్లుగా దోహ ఖతార్‌కు వెళ్లి వస్తున్నాడు. అయితే అక్కడ ఓ కంపెనీలో వాహనాలు కడుగుతూ ఇంటికి డబ్బును పంపిస్తున్న అతనికి మిషన్లు చెడిపోయాయంటూ నెల జీతంలో కొత విధించడంతో బాధతో కంపినీలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు ముందు నాగరాజు తన మిత్రులకు వాట్సాప్ ద్వారా వాయిస్ మెస్సేజ్ పంపాడు.