ఆ ద‌ర్శ‌కుడు దెబ్బ‌కి రోజూ ఏడ్చాను.. స‌న సంచ‌ల‌నం..!

Monday, November 12th, 2018, 01:10:25 PM IST

దేశ వ్యాప్తంగా మీ..టూ ఉధ్య‌మం ప్ర‌కంప‌నులు రేపుతున్నసంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ తారలు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల అనుభ‌వాల‌ను తెర‌పైకి తెచ్చి సంచ‌ల‌నం రేపుతున్నారు. కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో ర‌చ్చ లేపుతున్న ఈ లైంగిక‌వేధింపుల ఆరోప‌ణ‌లు దెబ్బ‌కి చాలామంది న‌టుల‌ను బ‌జారుకీడ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి స‌న తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన స‌న.. నిన్నేపెళ్ళాడుతా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన‌, అత్త పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే స‌న బుల్లితెర‌లో కూడా ప‌లు సీరియ‌ళ్ళ‌లో న‌టించింది. ఇక తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది స‌న‌. ఇంట‌ర్వ్యూలో భాగంగా స‌న‌ లైంగిక‌వేధింపుల గురించి మాట్లాడుతూ.. క‌న్న‌డ‌లో త‌న‌కు ఒక ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని.. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు త‌న‌ని టార్గెట్ చేశాడ‌ని.. అత‌ని వ‌ల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని, ఆ ద‌ర్శ‌కుడి వ‌ల్ల చాలా సార్లు ఏడ్చాన‌ని స‌న చెప్పింది. అయితే ఆ ద‌ర్శకుడి పేరు, సినిమా పేరు చెప్ప‌లేదు స‌న‌.