అయ్యయ్యో చేజారిపోయినట్టేనా.. అయోమయంలో తెలుగుదేశం పార్టీ..!

Monday, April 15th, 2019, 09:00:00 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీలు తమదే అధికారమని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుండి అనేక సర్వేలు ఎక్కువ శాతం వైసీపీదే విజయమని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం తాము మరోసారి గెలుస్తామని, ప్రజలంతా మరోసారి తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక జనసేన మాత్రం భారీగా ఓట్లు చీల్చు అవకాశం ఉందని సర్వత్రా అంచానావేశారు. అయితే పోలింగ్ తర్వాత చూస్తే, జనసేన ప్రభావం అంత లేదని అర్ధమవుతోంది. అయితే టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి 110 సీట్లు, జనసేనకు 30 సీట్లు ఖాయమని చెబుతున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే జనసేనకు పట్టున్న గోదావురి జిల్లాల్లో సైతం గెలుపు పై ఆ ఏ ఒక్క జనసేన నేతకి నమ్మకం లేకపోవడం గమనార్హం.

అయితే ప్రస్తుతం ఎన్నికలక ముందు నుండి వైసీపీ గాలి ఎలా వీచిందో అందరికీ తెలిసిందే. పోలింగ్ రోజు కూడా అదే విషయం స్పష్టమైంది. దీంతో టీడీపీ ఈవియంల పేరుతో కొత్త నాటకాలు స్టార్ట్ చేసింది. వారి ఉద్దేశం ఏంటంటే.. తాము గెలవక పోయినా పర్వాలేదు, వైసీపీ మాత్రం గెలవకూడదని, హంగ్ వచ్చినా పర్వాలేదని టీడీపీ భావిస్తోంది. అయితే ప్రజా తీర్పు మాత్రం ఈవింయంలలో నిక్షిప్తం అయ్యిందన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నేతలు హంగ్ గురించి మాట్లాడడం చూస్తుంటే.. అధికారం చేజారిపోయిందని వారికి ఇప్పటికే అర్ధమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.