జ‌గ‌న్ ఫైన‌ల్ డెషిష‌న్ కోసం వెయిటింగ్.. వైసీపీలోకి మ‌రో టీడీపీ కీల‌క నేత‌..?

Tuesday, February 26th, 2019, 09:21:30 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజులుగా కాకినాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత తోట నరసింహం వ్యవహారం టీడీపీ అధిష్టానానికి త‌ల‌పోటుగా మారింది.

త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎన్నికల్లో పోటీ చేయన‌ని చెప్పిన తోట న‌ర‌సింహం, భార్యను నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాబును కలిసి బార్య సీటు కోసం డిమాండ్ చేయడం జరిగిపోయింది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు నుండి ఎలాంటి హామీ రాలేదు. దీంతో వైసీపీలో చేరేందుకు తోట న‌ర‌సింహం ఆయ‌న కుటుంబం సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో తాజాగా తోట న‌ర‌సింహం వైసీపీ సీనియ‌ర్ నేత బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌తో భేటి అయ్యార‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా తోట న‌సింహంకు స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించింద‌ని తెలుస్తోంది.

దాదాపు గంట పైనే మంత‌నాలు జ‌రిపిన తోట న‌ర‌సింహం, బోత్సా స‌త్య‌నారాయ‌ణ‌లు, జ‌గ‌న్‌తో ఫైన‌ల్‌గా చ‌ర్చించి క్లారిటీ ఇస్తామ‌ని చెప్ప‌న‌ట్టు తెలుస్తోంది.

దీంతో మ‌రో టీడీపీ కీల‌క నేత వైసీపీ తీర్ధం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని దాదాపుగా తేలిపోయిన‌ట్టైంది. ఏది ఏమైనా మ‌రోసారి వైసీపీలోకి వ‌ల‌స‌లు స్టార్ట్ కానున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.