2019 ఎల‌క్ష‌న్స్ రిజ‌ల్ట్స్ : ఘోరంగా ఓడిపోయే టీడీపీ నేత‌ల లిస్ట్ ఇదే..!

Tuesday, April 16th, 2019, 01:20:28 AM IST

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌డంతో, ఆ ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఈ ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఎవ‌రు ఓడిపోతార‌నే దాని పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తికర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌లకు ఓటమి తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ వ‌ర‌స‌లో చూస్తే.. ముందుగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబుకు ఓటమి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం సాధించడం దాదాపు ఖాయమనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే మంత్రుల్లో ముఖ్యంగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇక మంత్రి అచ్చెన్నాయుడు ఓట‌మి కూడా ఖాయ‌మ‌ని, అలాగే సిద్ధా రాఘ‌వ‌రావు కూడా ఓడిపోతార‌ని అంటున్నారు. మ‌రోవైపు వైసీపీ నుండి ఫిరాయింపు నేత‌ల్లో ముఖ్యంగా అఖిల‌ప్రియ ఓట‌మి త‌ప్ప‌ద‌ని, అలాగే మ‌రో ఫిరాయింపు మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి గెలుపు కూడా చ‌లా క‌ష్ట‌మ‌ని, కడ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగిన ఆదినారాణ‌రెడ్డి అయితే ఘోరంగా ఓడిపోనున్నార‌ని, ఆయ‌న‌కు డిపాజిట్లు కూడా రావ‌ని విశ్లేష‌క‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.